
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- రాబోయే ఆగస్టు నెలలో ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో మొత్తంగా ఐదు ఆదివారాలు ఉండడంతో ఐదు రోజులు సెలవులు. అవి ఎలా అంటే?..
ఆగస్టు 3 ఆదివారం
ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 9 రక్షాబంధన్ ( రెండో శనివారం )
ఆగస్టు 10 ఆదివారం
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం
ఆగస్టు 16 కృష్ణాష్టమి
ఆగస్టు 17 ఆదివారం
ఆగస్టు 24 ఆదివారం
ఆగస్టు 27 వినాయక చవితి
ఆగస్టు 31 ఆదివారం
Also Read : నేటి తరంలో 100 అమ్మాయిల్లో నలుగురు మాత్రమే పవిత్రంగా ఉన్నారు: ప్రేమానంద్ మహారాజ్
కావున ఆగస్టు నెలలో మొత్తంగా పది రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం కావడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 8న పబ్లిక్ హాలిడేగా నిర్ణయించారు. అదే తెలంగాణలో ఆగస్టు 8న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. ఆ తరువాత ఆగస్టు 9న రెండో శనివారం అలాగే రక్షాబంధన్ కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వడం జరుగుతుంది. 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆరోజు కూడా సెలవు ఉంటుంది. ఇక 16వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా అన్ని స్కూళ్లకు అలాగే కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించనున్నారు.
Also Read : భక్తులతో కిటకిటలాడిన శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయం