
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగుడుంబా తరలిస్తున్న వ్యక్తిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం నగర్‌లో వాహన తనిఖీ సమయంలో భూక్యా రవి (45) అనే వ్యక్తి బైక్‌పై సుమారు 150 గుడుంబా ప్యాకెట్లను (సుమారు 8 లీటర్లు) రామకృష్ణాపూర్ పట్టణంలో విక్రయించడానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. గుడుంబా రవాణాకు ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read also :-
వే మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూల పంపిణీ





