
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- కోనసీమ జిల్లా కలెక్టర్ కు తాజాగా పెను ప్రమాదం తప్పింది. డ్రాగన్ పడవల పోటీల ట్రైల్ రన్ నిర్వహిస్తుండగా కలెక్టర్ ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగ అదుపుతప్పడంతో కలెక్టర్ నీళ్లలో పడిపోయారు. ఈ ఘటనతో పక్కన ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తాజాగా పులిదండి వద్ద కాలువలో డ్రాగన్ పడవల పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ లో భాగంగా కలెక్టర్ ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్నటువంటి కలెక్టర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఇద్దరూ నీళ్లలో పడిపోయారు. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్లు స్పందించి కలెక్టర్ మహేష్ కుమార్ ను సురక్షితంగా ఇంకో బోర్డులోకి తరలించి తీరానికి చేర్చారు. అయితే ఆ సమయంలో ఈ ఘటనను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకంత ఆందోళన మరియు ఆశ్చర్యానికి గురయ్యారు. కలెక్టర్ మహేష్ కు లైఫ్ జాకెట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే కలెక్టర్ ప్రాణాలు మీదకే వచ్చేది. ఏది ఏమైనా కూడా ఈ ఘటనతో కోనసీమ జిల్లా అధికారులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Read also : వివిధ మతాల్లో నూతన సంవత్సరాన్ని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
Read also : న్యూ ఇయర్ వేడుకలలో విషాదం.. మద్యం తాగి బిర్యానీ తినడంతో మృతి!





