
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- భారతదేశంలోనే ఎంతో పేరుగాంచిన ప్రముఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు నేడు తృటిలో భారీ ప్రమాదం చెప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కి వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మెహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూస పల్లి రైల్వే స్టేషన్ అప్ లైన్ లో 428/11 వద్దా రైల్వే ట్రాక్ పై అనుకోకుండా వచ్చిన ఎద్దును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల పాటు వందే భారతి ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్పై అలానే నిలిచిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్పై పడి ఉన్న ఎద్దును తొలగించారు. ఈ ఘటన లో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. వెంటనే రైల్వే అధికారుల చొరవతో రైలు యధావిధిగా సికింద్రాబాద్కు బయలుదేరింది. ఎద్దు కారణంగా కొంతసేపు ఉండే భారతి ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోవడం కారణంగా ఆ రైల్వే లైన్ లో వచ్చేటువంటి మిగతా రైలు సమయాలలో మార్పులు అయ్యాయి. చాలాసేపు రైలు ఆగిపోవడం వల్ల ట్రైన్ లోని సిబ్బంది కాస్త ఇబ్బంది పడడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎందుకు కూడా గాయాలు అవడంతో ఎద్దు యజమాని కోసం సమీప రైల్వే స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావ్రతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
కిషన్‌రెడ్డితో కలిసి రేవంత్ చిల్లర రాజకీయాలు – హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం