
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-టాలీవుడ్ లో అనుష్క శెట్టికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అరుంధతి, భాగమతి, డాన్, బాహుబలి వంటి సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తమ వసం చేసుకుంది అనుష్క. హీరోయిన్ గా ప్రాధాన్యమైన పాత్రలు చేసుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అనుష్క తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి కాస్త దూరంగా ఉండాలని అనుకుంటున్నానని అనుష్క సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. అనుష్క శర్మ కూడా సోషల్ మీడియా నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన జీవితాన్ని గుర్తించుకోవడానికి.. అలాగే ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అనుష్క వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మీ ముందుకు వస్తానని… అప్పటివరకు ప్రతి ఒక్కరు చిరునవ్వుతోనే ఉండండి అని.. ‘ప్రేమతో మీ అనుష్క శెట్టి’ అని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు అనుష్క.
Read also : తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు.. జర జాగ్రత్త!
అయితే అనుష్క చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక నోట్ బుక్ లో రాసిన విషయాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కాగా టాలీవుడ్ లో దాదాపు 20 సంవత్సరాలు పాటు హీరోయిన్ గా అనుష్క తన సినిమా కెరీర్ ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అనుష్క తాజాగా ఘాటి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదలవగా… సినిమాపై నెగటివ్ టాక్ రావడం జరిగింది. కానీ అందులో అనుష్క నటన మాత్రం చాలా అద్భుతమని ప్రశంసలు వస్తున్నాయి. అనుష్క ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. కానీ తాజాగా సోషల్ మీడియాకు కాస్త విరామం ఇస్తున్న అని చెప్పగానే అనుష్క అభిమానులు అందరూ కూడా షాక్ కు గురవుతున్నారు. మరి ఎప్పటి వరకు విరామం తీసుకుంటారో?.. అనేది మాత్రం అనుష్క క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అనుష్క అభిమానుల గుండెల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది.
Read also : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభం