నిన్న మొన్నటిదాకా బంగ్లాదేశ్లో హిందువులపై అతి ఘోరంగా దాడులు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న బంగ్లాదేశ్ లో హిందువులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. మైనారిటీల హక్కుల గురించి పరిరక్షణ కోసం వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ప్రధాన రహదారులన్నీ కూడా హిందువుల జనంతో కిక్కిరిసిపోయాయి.
చటోగ్రామ్ లో సనాతన జగన్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఘనంగా జరిగింది. అలాగే మహమ్మద్ యునెస్ సారధ్యంలోని తాత్కాలికి ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు అనేవి హిందువులు ఉంచారు. ఇక వాటిని నెరవేర్చే వరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందు ఉద్యమకారులు గొంతు విప్పి మరీ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం బంగ్లాలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దాంతో అప్పుడు షేక జీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా హసీనా రాజీనామా చేసి ఆదేశం నుండి ఈ తప్పించుకొని వచ్చి మన భారతదేశంలో తలదాచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరిగే వరకు యోనోస్ నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై అప్పుడు హిందువులపై జరిగినటువంటి దాడులు అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అల్లర్లలో చాలామంది హిందువులు చనిపోయిన సందర్భాలు కూడా మనం చూశాం. కాబట్టి ఈ రిజర్వేషన్ల మద్దతు కొరకు ఇప్పుడు భారతీయులందరూ కూడా బంగ్లాదేశ్ లో తమ డిమాండ్లను నెరవేర్చాలని భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.