
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో : చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం తిండి తిప్పలు లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన కొందరు ఉద్యోగులు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాల పేరుతో అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపుగా 5 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సంఘటన విజయవాడలో వెలుగు చూసింది.
పూర్తి వివరాలకు వెళితే యస్ శ్రీనివాస్ అనే వ్యక్తి విజయవాడలోని విజయవాడలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎస్ శ్రీనివాస్ దగ్గరికి రాగా దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో మొదటి విడతగా 25 లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ గురించి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకి సమాచారం అందించగా గురువారం శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అయితే ఏసీబీ అధికారులు మాట్లాడుతూ దేశంలోని ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఘటనలలో ఇదే మొదటిసారి అని తెలిపారు. అలాగే శ్రీనివాస్ గతంలో కూడా రెండుసార్లు లంచం తీసుకుంటూ దొరికిపోయాడని అయినప్పటికీ శ్రీనివాస్ తీరు ఏమాత్రం మారలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు మీడియాకి తెలిపారు. ఐదు కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ శ్రీనివాస్ దొరికిపోవడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే ఏపీ గవర్నమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొందరు నెటిజెన్లు శ్రీనివాస్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని అధికారులను కోరుతున్నారు.