
– కన్నీటి సంద్రంలో అంబటిపల్లి గ్రామం
– శాశ్వతత్వంలో శాంతితో కూడిన విశ్రాంతి
– నివాళులర్పించిన గ్రామస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన బాసాని ఆనంద్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులకై హైదరాబాదులో ఉంటున్న ఆనంద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక స్థితితో మృతి చెందడం జరిగింది. శనివారం ఉదయం పార్థివదేహం స్వగ్రామానికి చేరుకుంది. వారి పార్థివదేహానికి గ్రామస్తులు మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆనంద్ పార్థివ దేహానికి వీడ్కోలు పలకడానికి ప్రజలు వేల సంఖ్యలో చేరుకుని అమరుడికి అంతిమ వీడ్కోలు పలికారు.ఈ ఘటన తో గ్రామమంతా కూడా కన్నీటి సంద్రం లో మునిగింది.
Read also : మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Read also : Sex Awareness: పీరియడ్స్ టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా?





