Homeఆంధ్ర ప్రదేశ్క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు రూ.494 గ్రాముల బంగారు కిరీటం కానుక‌...!

క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు రూ.494 గ్రాముల బంగారు కిరీటం కానుక‌…!

విజ‌య‌వాడ‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: భ‌క్తులు కోరుకున్న కోర్కెలు తీర్చే కొంగుబంగార‌మైన విజ‌య‌వాడ క న‌క దుర్గ‌మ్మ‌కు న‌గ‌దు, వివులైన ఆభ‌ర‌ణాలు కానుక‌ల‌ను స‌మ‌ర్పించి త‌మ భ‌క్తిని చాటుకుంటారు. తాజాగ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో అమ్మ‌వారికి స్వ‌ర్ణ కిరీటం కానుకగా అందింది. దాదాపు రూ.75 లక్షలు విలువైన స్వర్ణ కిరీటాన్ని దాతలు బహూకరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాతలు 494 గ్రాముల బంగారు కిరీటాన్ని దుర్గమ్మకు కానుకగా సమర్పించారు. కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె.దుర్గా శ్రీనివాస్‌ స్వర్ణ కానుక అందించారు.

ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో నవరత్న ఖచిత కిరీటాన్ని రూపకల్పన చేశారు. గురువారం స్వర్ణ కిరీటాన్ని ఆలయ ఈవో వీకే శీనా నాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి.త్రినాథరావుకు దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయడంతో పాటు.. శేషవస్త్రం, ప్రసాదాలతో దాతలను అధికారులు సత్కరించారు. అమ్మవారి దయతోనే స్వర్ణ కిరీటాన్ని సమర్పించుకోగలిగామని దాత దుర్గా శ్రీనివాస్ తెలిపారు.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఉత్సవాల్లో ఐదోరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవకు ఈడీ నోటీసులు!
  2.  ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు!
  3.  శోభితా ధూళిపాళ మనసులో మాట.. మాతృత్వంపై తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు!
  4. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు మరణశిక్ష

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు