
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- నన్ను ఆశీర్వదించండి.. మార్చాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి కల్వకుర్తి మండలంలోనే మార్చాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని స్వతంత్ర అభ్యర్థి వెంకట చలమారెడ్డి కోరారు. కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాలా గ్రామంలో వెంకట చలమారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడపగడపకు తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం మార్చాలా పరిధిలోని కాటన్ మిల్లు వద్ద ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
Read also : ఇండియా పరువు పోయింది.. రామ్మోహన్ వెంటనే రాజీనామా చెయ్ : గుడివాడ అమర్నాథ్
ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను మార్చల గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద 7 వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని చెప్పారు. మార్చాల గ్రామాన్ని విద్య, వైద్యం, ఉపాధితో పాటు మౌలిక వసతులు కల్పించి మార్చాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. గ్రామంలో ఏళ్లకాలంగా అపరిష్కృతంగా ఉన్న స్మశాన వాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుస్తానని చెప్పారు. గ్రామంలో నిఘా వ్యవస్థలో భాగంగా యువత పెడదారిన పడకుండా నిరంతరం పర్యవేక్షణ జరిగే విధంగా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో నిరుపయోగంలో ఉన్న పాత ప్రభుత్వ భవనాలను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామ పంచాయతీలో వైకుంఠధామ రథం తో పాటు ఫ్రీజర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి పెడదారి పట్టకుండా వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తలసాని వెంకట చలమారెడ్డి తెలిపారు.
Read also : Murder Case: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య





