
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ వంటి డెలివరీ ప్లాట్ఫార్మ్స్ లలో కూడా మోసాలు జరుగుతున్నాయి అని సదురు వ్యక్తులు మండిపడుతున్నారు. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఎలాంటివైనా సరే నిమిషాల్లో ఇలా ఆర్డర్ చేసుకుంటే ఒక వారంలోపు మన ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాలలో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వస్తుంది అంటూ ఆ ప్లాట్ఫామ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రేమానంద్ అనే ఒక టెక్ ఉద్యోగికి అమెజాన్ లో చేదు అనుభవం ఎదురైన సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ప్రేమానంద్ అనే వ్యక్తి దాదాపు 1.87 లక్షల రూపాయలతో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7 ఫోన్ అమెజాన్ ద్వారా ఆర్డర్ చేశాడు.
Read also : ఈ జిల్లాలకు వర్షాల విముక్తి ఇంకెప్పుడు?
ఎంతో ఆశగా ఈ మొబైల్ కోసం ఎదురుచూసినటువంటి వ్యక్తికి అమెజాన్ నుంచి డెలివరీ బాక్స్ వచ్చింది. అయితే చాలా ఆనందంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో మొబైల్ ఫోన్ కు బదులు ఒక టైల్ ముక్క ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వెంటనే అతను నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. చివరికి ఎలా గోలా amazon నుంచి అతనికి 1.87 లక్షల రూపాయలు రిఫండ్ వచ్చాయి. ఈ ఘటన దీపావళి ముందు జరగగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వైరల్ అవుతుంది. దీంతో సహజ డెలివరీ ఉద్యోగులు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ amazon మరియు flipkart వంటి డెలివరీలు ప్రజలకు చాలా సహాయపడుతున్న కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని వీటిపై దృష్టి సారించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
Read also : టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా పెరుగుతుంది.. వీటిపై చట్టాలు తీసుకురావాలి : చిరంజీవి
 
				 
					
 
						 
						




