Homeతెలంగాణభాగ్యనగరంలో లండన్ మోడల్...!

భాగ్యనగరంలో లండన్ మోడల్…!

  • హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు కొత్త పరిష్కారం

  • ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థ అవసరం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్న రోజురోజుకు ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. రోడ్లు వెడల్పు చేయడం, ఫ్లై ఓవర్లు నిర్మించడం ద్వారా మాత్రమే పరిష్కరించలేమని.. ప్రైవేటు వాహనాలకు ధీటుగా బస్సులు, మెట్రోను అనుకూలమైన ప్రత్యామ్నాయాలుగా మార్చే సమన్వయ ప్రజా రవాణా వ్యవస్థ అవసరం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశివర్మ సూచించిన లండన్ రవాణా సంస్కరణల పాఠాలు హైదరాబాద్కు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన లండన్ నగరం తన రవాణా నెట్వర్క్ ను ఎలా పునర్వ్యవస్థీకరించుకుందో వివరిస్తూ.. హైదరాబాద్ పరిశీలించాల్సిన కీలక అంశాలను ప్రస్తావించారు.

ఒకే గొడుగు కిందకు రవాణా వ్యవస్థ…

భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు లండన్ మోడల్ పరిశీలనలో ఉంది. నగరంలో విస్తరిస్తున్న కొద్ది తలెత్తిన ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు లండన్ 2000లో రైళ్లు, రోడ్లు, అండర్ గ్రౌండ్, బస్సులు, సబర్బన్ రైలు సేవలకు బాధ్యత వహించే 14 సంస్థలను ఒకే గూడుకు కిందకు ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ గా తీసుకువచ్చింది. ఈ ఏకీకృత విధానం వివిధ రవాణా మాధ్యమాల మధ్య సమన్వయాన్ని మరింత సులభతరం చేసింది. ఇదే తరహాలో ప్రజా రవాణా, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు ఉన్న సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరిచేందుకు హైదరాబాద్ కూడా ఇలాంటి విధానాన్ని పరిశీలించాలని సూచనలు వచ్చాయి. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పట్టణ రవాణా, మెట్రో రైలు ప్రభుత్వ సలహాదారుడు ఎన్ వి ఎస్ రెడ్డి ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అలా చేస్తేనే…

భాగ్యనగరంలో ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది. కానీ అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా పెరిగితే వ్యక్తిగత వాహనాలు సంఖ్య తగ్గే అవకాశం ఉంది. హైదరాబాదులో బస్సుల సంఖ్యను పెంచడంతోపాటు ఫుట్ పాత్లను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. నివాస ప్రాంతాలు, కాలనీలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించేలా బస్సులు నడిచేందుకు అనువైన ఫుట్ పాత్లు ఉంటే.. ప్రయాణాల మొదటి, చివరి దశలు సులభం అవుతాయి. తద్వారా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఇంట్లోనే వదిలి పెట్టేందుకు మొగ్గు చూపుతారు. హైదరాబాదులో ప్రజా రవాణా వాటా 40 శాతానికి పైగా ఉండే స్థితి నుంచి 28 శాతానికి పడిపోయిందని.. దీనిని తిరిగి 40 శాతానికి చేర్చి.. క్రమంగా 60 శాతానికి మించి తీసుకెళ్లే లక్ష్యంతో పరిచేయాలన్న సూచనలు వచ్చాయి. రోడ్ల వెడల్పు, ఫ్లై ఓవర్లు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. అందుకే ఇప్పుడు లండన్ మోడల్ తోనే భాగ్యనగరం గట్టెక్కే అవకాశం ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ: ముంబై ఇండియన్స్ తలరాత మారనుందా?
  2. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సునామీ: ₹1,000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర!
  3. ప్రపంచానికి పొంచి ఉన్న ఆకలి ముప్పు
  4. దక్షిణాదికి పెరగనున్న రాజకీయ బలం: సీఎం చంద్రబాబు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు