Homeతెలంగాణరేవంత్ మహారాష్ట్ర బాట...! తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప‌ట్టాలెక్కేనా...?

రేవంత్ మహారాష్ట్ర బాట…! తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప‌ట్టాలెక్కేనా…?

  • ఉత్తర తెలంగాణ తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

  • అదే జరిగితే రేవంత్ ఇమేజ్ పెరగడం ఖాయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తనకంటూ పొలిటికల్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్. పది సంవత్సరాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు రేవంత్. ముఖ్యంగా తుమ్మిడి హట్టి బ్యారేజీ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కిస్తూ.. ఉత్తర తెలంగాణ తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయాత్మకంగా ముందడుగు వేశారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద 1502 మీటర్ల ఎత్తులో గ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఆమోదం సాధించడమే లక్ష్యంగా ఆయన ముంబై పర్యటనకు వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నేరుగా సమావేశమై సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించాలన్నది ఆయన లక్ష్యం. అంతర్రాష్ట్ర జల వివాద ప్రతిష్టంబను తొలగించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీస్తోంది.

కెసిఆర్ విశ్వప్రయత్నాలు…

వాస్తవానికి గులాబీ పార్టీ హయాంలోనే కెసిఆర్ ఇటువంటి ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదని డిజైన్ మార్చేశారు. ఏకంగా బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించారు. చివరకు ప్రాజెక్టు డిజైన్ నే రీ ఇంజనీరింగ్ పేరుతో మేడిగడ్డకు మార్చేసింది. దీనివల్ల వేలకోట్ల ప్రజాధనం వృధా కావడంతో పాటు ఉత్తర తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వం విఫలమైన చోట పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా కార్యచరణ సిద్ధం చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణ పై నిరంతర సమీక్షలు నిర్వహించడం, సాంకేతిక అధ్యయనాలు చేయించడం వంటివి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అంతర్రాష్ట్ర చర్చలకు మార్గం సుగమం చేశారు.

గట్టి వాదనలతో తెలంగాణ …

తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఒక వాదన వినిపిస్తోంది. ఉమ్మడి హట్టి బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 150 మీటర్ల వద్దే నిర్మించడం.. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే గ్రావిటీ పద్ధతిలో సహజసిద్ధంగా నీటిని దిగువకు తరలించడం సాధ్యమవుతుంది. దీనివల్ల ఎత్తిపోతల అవసరం తగ్గి.. విద్యుత్ బిల్లుల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆర్థిక భారం తప్పుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి కరువు పీడిత ప్రాంతాల్లోనే లక్షలాది ఎకరాలకు ఎలాంటి సంక్లిష్టతకు తావు లేకుండా నేరుగా సాగునీరు అందడంతో పాటు గ్రామాలకు శాశ్వత తాగునీటి భద్రత లభిస్తుంది.

మహారాష్ట్ర సందేహాల నివృత్తి…

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడి ముంపు భయాలను శాస్త్రీయంగా నివృత్తి చేసేందుకు తెలంగాణ ఇంజనీరింగ్ విభాగం సరికొత్త ముంపు మ్యాపింగ్ను మహారాష్ట్ర ముందు ఉంచనుంది. 152 మీటర్ల ఎత్తు వద్ద మహారాష్ట్ర భూభాగంలో ముంపు ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించేలా రక్షణ గోడలు నిర్మించడం, ముంపునకు గురయ్యే కొద్దిపాటి భూములకు మార్కెట్ ధర కంటే మెరుగైన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే ప్రతిపాదనలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఉంచనున్నారు. ఈ రాయితీలు, సమగ్ర సాంకేతిక వివరాల ద్వారా సరిహద్దు రాష్ట్రంతో స్నేహపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. మొత్తానికైతే మహారాష్ట్రను ఒప్పిస్తే రేవంత్ పొలిటికల్ గా తెలంగాణలో ఒక ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయం.

ఇవి కూడ చ‌ద‌వండి:

  1. ఏపీలో స్థానిక ఎన్నికలు రద్దు..!
  2.  ‘పట్టభద్రులు’ పై కెసిఆర్ పక్క స్కెచ్…!
  3. సోనియా గాంధీ ఆత్మకథ…!
  4.  రేవంత్ ది భయమా? జాగ్రత్తా…?… సీఎం నోట పదే పదే ఎల్ నినో మాట…

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు