క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ దిగ్గజ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. ఇటీవల హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్ బై చెప్పడంతో, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఈ కీలక బాధ్యతలను పొలార్డ్‌కు అప్పగించింది.ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో పొలార్డ్‌కు దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. మొదట ఆటగాడిగా జట్టుకు సేవలు అందించిన ఆయన, ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్‌గా కూడా కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2022 వరకు వరుసగా 13 సీజన్ల పాటు ముంబై తరఫున మైదానంలో దిగిన పొలార్డ్, ఎన్నో గుర్తుండిపోయే విజయాలను అందించారు.
మహిళా నాయకులపై దాడులా?.. చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!
తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 211 మ్యాచ్‌లు ఆడిన ఆయన 3,915 రన్స్ సాధించారు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ గెలుచుకున్న 5 ఐపీఎల్ ట్రోఫీల విజేత జట్టులోనూ ఆయన ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్లేయర్ స్థాయి నుంచి ప్రధాన కోచ్‌గా సరికొత్త అవతారంలో ముంబై జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు.
విజయ్ నా లక్కీ చార్మ్.. ఆయన నా ఫేవరెట్ స్టార్!”: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
