Homeఅంతర్జాతీయంవ‌నాటు దీవుల్లో భారీ భూకంపం...! రిక్ట‌ర్ స్కేలుపై 7 .2 తీవ్ర‌త‌గా న‌మోదు...

వ‌నాటు దీవుల్లో భారీ భూకంపం…! రిక్ట‌ర్ స్కేలుపై 7 .2 తీవ్ర‌త‌గా న‌మోదు…

వ‌నాటు, క్రైమ్‌మిర్ర‌ర్‌: భారీ భూకంపం వ‌నాటు దీవుల‌ను ఒక్క‌సారిగా వ‌ణికించింది. ద‌క్షిణ ప‌సిఫిక్ మ‌హాసముద్రంలోని వ‌నాటు దీవుల స‌మీపంలో శ‌నివారం రిక్ట‌ర్ స్కేలుపై 7.2 తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అమెరికా భూగ‌ర్భ ప‌రిశోధ‌న సంస్థ వెల్ల‌డించింది. ఈ భూకంపం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం, ప్రాణ న‌ష్టం అధికారికంగా వెల్ల‌డికావాల్సి ఉంది. ఈ భూకంపం వనాటు దీవుల్లోని సోలా ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. సముద్ర గర్భంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.

భూకంప కేంద్రం సముద్రంలో తక్కువ లోతులో ఉండటంతో సమీప తీర ప్రాంతాలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. అలాగే, ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. వనాటు ప్రాంతం భూకంపాలు తరచుగా సంభవించే పసిఫిక్‌ అగ్నిపర్వత వలయం (రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌) పరిధిలో ఉంది. ఇక్కడ భూఫలకాల కదలికల కారణంగా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. కాగా, తాజా భూకంపంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ప్రభాస్ బర్త్‌డేకు గ్లోబల్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్ నుంచి జపాన్ వరకు అభిమానుల సందడి!
  2.  పులివెందులలో ఉద్రిక్తత.. వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటికి పోలీసుల నోటీసులు!
  3.  మహారాష్ట్రలో పట్టపగలే దారుణ హత్య.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, ఇనుప రాడ్‌తో దాడి!
  4.  ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు