హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమం నుంచి ఎయిరిండియా విమానం బయలు దేరిని కొద్ది సేపటకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం ఉదయం ఏఐ417 విమానం శంషాబాద్ నుంచి ముంబైకి బయలుదేరింది. ఈ సమయంలో విమానంలో 109 మంది ప్రయాణీకులు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతికలోపాన్ని పైలట్ గుర్తించారు.వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఆ తరువాత పైలట్.. విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడ చదవండి:
- గడ్డపోతారం ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్ర్బాంతి…! మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి…
-
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి…! పదవుల కోసం ఎదురు చూపులు…
-
ఫ్రాన్స్ లో అల్లర్లు…!ముస్లింల వలసదారులే కారణమా…?
-
నాది సౌత్ ఇండియా.. ఆ యాస రాక ఏం చేస్తుంది?: విమర్శలకు రష్మిక ఘాటు సమాధానం
