Homeక్రైమ్పండగ పూట విషాదం.. ఎనిమిది నెలల వైవాహిక జీవితానికి విషాదాంతం

పండగ పూట విషాదం.. ఎనిమిది నెలల వైవాహిక జీవితానికి విషాదాంతం

క్రైమ్ మిర్రర్ : తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయి ఎనిమిది నెలలు కూడా పూర్తికాకముందే ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. భర్తతో జరిగిన వాగ్వాదం అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మహిళ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది?

చెన్నైలోని క్రోమ్‌పేట్ సమీపంలోని నెమిలిచెర్రీ ఫాతిమా నగర్‌లో జగదీశన్ (28), అరుణ (26) దంపతులు నివసిస్తున్నారు. పల్లవరంలోని ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో జగదీశన్ పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. ఆయుధ పూజ సెలవు సందర్భంగా తనను బయటకు తీసుకెళ్లాలని అరుణ భర్తను కోరినట్లు సమాచారం. అయితే, స్నేహితులతో బయటకు వెళ్లాల్సి ఉందని, ఆ సమయంలో ఆమెను తీసుకెళ్లలేనని జగదీశన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం జగదీశన్ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా అరుణ అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో అతడు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆర్డీవో విచారణకు ఆదేశాలు

సమాచారం అందుకున్న చిట్లపాక్కం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జగదీశన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహమై ఎనిమిది నెలలే కావడంతో ఈ ఘటనపై తాంబరం ఆర్డీవో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అరుణ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదమే కారణమా? ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు, విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : ఖమ్మంలో విషాదం.. బెదిరింపు ఫోన్లతో యువ న్యాయవాది బలవన్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు