Homeతెలంగాణఅగ్ని గోళంగా మారిన ఫ్రాన్స్‌...! తీవ్ర‌రూపం దాల్చిన ఆందోళ‌న‌లు...

అగ్ని గోళంగా మారిన ఫ్రాన్స్‌…! తీవ్ర‌రూపం దాల్చిన ఆందోళ‌న‌లు…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిర‌స‌న‌ల‌తో ఫ్రాన్స్ అగ్ని గోళంగా మారింది. దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో భ‌వ‌నాలు నిప్పు పెట్ట‌గా అవి మంట‌లకు ఆహుతి అయ్యాయి. ముసుగు ధ‌రించిన కొంద‌రు నిర‌స‌న‌కారులు దుకాణాల‌ను సైతం ద్వంసం చేసి వ‌స్త‌వుల‌ను దోచుకెళ్లారు. ఈ ప్ర‌జా ఆందోళ‌న‌ల‌తో పారీస్ ద‌ద్ద‌రిల్లింది. దేశ వ్యాప్తంగా సుమారు 5లక్ష‌ల పైచిలుకు మంది వీధుల్లోకి వ‌చ్చార‌ని, వీరిలో పారీస్లోనే 1.10 ల‌మంది ఉన్నార‌ని ఫ్రాన్స్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు.

నిర‌స‌న‌ల్లో పాల్గొన్న సుమారు 1800 మంది ఆందోళ‌న‌కారుల‌ను అరెస్టు చేయ‌గా, 150 మంది పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి సెబాస్టియ‌న్ లెకోర్ను తెలిపారు. పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు క్రమంగా విస్తృత ఉద్యమంగా మారాయి. ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తితో ఉన్న కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. హింసాకాండను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఖండించారు. దేశంలో హింసకు చోటులేదని పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

భ‌వ‌నాలకు నిప్పు…

19వ శ‌తాబ్దానికి చెందిన మ‌ద్య ప్రాన్స్‌లో ఉన్న లిమోజెస్ న‌గ‌రంలో న‌గ‌ర‌పాల‌క భ‌వ‌నానికి ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్ట‌దారు. దీంతో పై క‌ప్పు పూర్తిగా కాలిపోయింది. ఈ సంద‌ర్భంగా మంత్రి నూనెజ్ ఈ సంద‌ర్భంగా స్పందించారు. నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కు అయినప్పటికీ, హింస ద్వారా ఉద్దేశపూర్వకంగా అల్లకల్లోలం సృష్టించడాన్ని అంగీకరించబోమని హెచ్చ‌రించారు. పారిస్‌, మార్సెయి, లియోస్‌, బోర్డో సహా పలు నగరాల్లో వందలాది వ్యాపార సంస్థలు లూటీకి గురయ్యాయని తెలిపారు.బోర్డో నగరంలో లూయిస్‌ విట్టన్‌ దుకాణాన్ని నిరసనకారులు లూటీ చేయగా, లిల్లేలో యాపిల్‌ స్టోర్‌ను ధ్వంసం చేశారు. పారిస్‌లో దుస్తులు, ఆహార పదార్థాల దుకాణాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. పారిస్‌లోని ప్లాస్‌ ద లా రిపబ్లిక్‌ కూడలి పరిసరాల్లో ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా ధ్వంసమైన దుకాణాల అద్దాలు, విరిగిపడిన రాళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువలే కనిపించాయి. పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లోనూ దుకాణాల లూటీ, ఆస్తుల ధ్వంసం జరిగినట్టు అధికారులు తెలిపారు. పారిస్‌ ప్రాంతంలోనే 885 మందిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలంగాణలో యాసంగి సాగు ఆశాజనకం: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పుంజుకోనున్న పంటల విస్తీర్ణం!
  2. వర్షపాతంతో వణికిపోతున్న చెన్నై
  3. బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
  4. ‘రామాయణం’పై రాజమౌళి ప్రశంసలు.. నవంబర్ 5 కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్!

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు