బిగ్ బాస్ తమిళ్ సీజన్ 10 మొదలైన కొద్దిరోజుల్లోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 6న ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్టింగ్‌లో ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో షో మొదలవగా.. ‘కుక్ విత్ కోమాలి’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అన్సార్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
అయితే షో ప్రారంభమైన రెండు రోజులు కూడా పూర్తికాకముందే అన్సార్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. హౌస్‌లో జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన తీవ్రంగా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ జాసన్‌తో చోటుచేసుకున్న వాగ్వాదం, అనంతరం కెప్టెన్సీకి సంబంధించిన చర్చలు అన్సార్‌ను ఇబ్బందికి గురిచేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి లోనై బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇదే తరహాలో గతంలో బిగ్ బాస్ తమిళ్‌లో పాల్గొన్న నటుడు భరణి కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో అన్సార్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈసారి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 10లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు పలు కొత్త కాన్సెప్టులను తీసుకొచ్చారు. అందులో ‘డెమోక్రసీ రూమ్’ కూడా ఒకటి. ఈ కొత్త అంశాలు హౌస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తిగా మారింది.
షో మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో.. రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లో మరింత రసవత్తర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
also read: RC17లో రామ్ చరణ్ సరికొత్త అవతారం.. లుక్‌పై ఆసక్తికరమైన టాక్
