Homeతెలంగాణమాజీ మంత్రి కొండా సురేఖకు వరుస షాక్‌లు: సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం రద్దు!

మాజీ మంత్రి కొండా సురేఖకు వరుస షాక్‌లు: సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం రద్దు!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా బిగ్ షాక్‌లు ఇస్తోంది. ఇటీవల ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన ప్రభుత్వం, తాజాగా ఆమెకున్న భద్రత మరియు అధికారిక సౌకర్యాలను సైతం పూర్తిగా ఉపసంహరించుకుంది.

బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, గన్‌మెన్లు ఉపసంహరణ:- కొండా సురేఖ ఉపయోగిస్తున్న అధికారిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సంబంధిత అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు ఎస్కార్ట్, ఇంటెలిజెన్స్ విభాగాల నుండి ఆమెకు కేటాయించిన 4+4 గన్‌మెన్లను కూడా తొలగించారు. సాధారణ నియమావళి ప్రకారమే మంత్రి పదవి ఊడటంతో ఈ భద్రతా ప్రోటోకాల్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని సమాచారం.

నివాసం వద్ద బందోబస్తు రద్దు:కేవలం వాహనం, గన్‌మెన్ల తొలగింపుతోనే సరిపెట్టకుండా, హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఇప్పటివరకు కొనసాగిన ప్రత్యేక పోలీసు బందోబస్తును కూడా ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి బర్తరఫ్ తర్వాత ఈ వేగవంతమైన భద్రతా ఉపసంహరణ నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం…! ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు