Homeసినిమాప్రేమపై హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రేమపై హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ప్రేమ, అనుబంధాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ‘EPIC’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెకు యాంకర్ నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది. “మీ దృష్టిలో ప్రేమకు అసలైన డెఫినిషన్ ఏమిటి?” అని ప్రశ్నించగా, “నా దృష్టిలో లవ్ అంటే కేవలం మాటలు కావు.. ఒకరికొకరు తోడుగా ఉండే ‘పార్ట్‌నర్‌షిప్’, ఒకరిపై ఒకరికి ఉండే ‘నమ్మకం (ట్రస్ట్)’, మరియు పరస్పర ‘కమిట్‌మెంట్'” అని స్పష్టం చేశారు.ఇకపోతే, ఇటీవల ఓ చిత్ర షూటింగ్‌ సమయంలో రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు తగిన విశ్రాంతి తీసుకున్న ఆమె, ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భర్త విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ‘రణబాలి’ సినిమా సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. రష్మిక తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం…! ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’…

మైలార్‌దేవ్‌పల్లిలో వరుస హత్యలు…! భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు….

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు