Homeతెలంగాణఘ‌నంగా శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుక‌లు...! భ‌క్తుల‌తో కిక్కిరిసిన ఆల‌యాలు...

ఘ‌నంగా శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుక‌లు…! భ‌క్తుల‌తో కిక్కిరిసిన ఆల‌యాలు…

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే వేణుగోపాలుడి ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ఆ మాధవుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టి సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులకు గాయాలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, క్యూలైన్‌ను ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఇస్కాన్ ఆలయం మార్మోగుతోంది.

Also Read:మైనర్‌పై లైంగిక దాడి.. ఇద్దరు ఆటో డ్రైవర్ల అరెస్ట్‌

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు