Homeసినిమా‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌కు రెడీ.. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌కు రెడీ.. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందనున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు.

ప్రస్తుతం ‘ఐయామ్ గేమ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వెంకీ అట్లూరి.. ‘లక్కీ భాస్కర్’ రెండో భాగానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు హీరో దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు.

భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటన, వెంకీ అట్లూరి కథనం, దర్శకత్వం ‘లక్కీ భాస్కర్’కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా సినిమాలోని కథా మలుపులు, దుల్కర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

అయితే ‘లక్కీ భాస్కర్ 2’ కథ ఎలా ఉండబోతోంది? మొదటి భాగంలోని పాత్రలనే కొనసాగిస్తారా? సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే విషయాలపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్త మాత్రం అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది.

also read: పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. కుటుంబానికి అండగా నిర్మాత ఎస్కేఎన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు