-
దేశవ్యాప్తంగా ప్రముఖుల శుభాకాంక్షలు
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసైనికుల సేవా కార్యక్రమాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం జనసేన మాత్రమే కాదు కూటమి పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రధాని విషెస్…
Also Read:వాహనం సీటు కింద రహస్య అర.. రూ.1.44 కోట్ల నగదు స్వాధీనం
జనసేనానికి ప్రధాని నరేంద్ర మోడీ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ప్రజల్లో ఎంతో గౌరవం ఉందని.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎంబీఏ సుపరిపాలన అజెండాను ముందుండి నడిపిస్తున్నారు. సమాజ సేవలో ఆయన దీర్ఘాయుష్ తో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కు పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు.’ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అందించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆప్యాయత, ప్రోత్సాహంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయాలని నా సంకల్పాన్ని బలపరిచింది. 140 మంది కోట్ల భారతీయుల కలలు, ఆకాంక్షలను మోస్తూ, సమైక్య భారత్ నిర్మాణం పట్ల మీకున్న నిబద్ధత దేశాన్ని స్ఫూర్తినిస్తుంది. మీ దార్శనిక నాయకత్వంలో, ఎన్డీఏ సమిష్టిబలంతో,, సుపరిపాలన, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మేము దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్, దేశ సేవలో నా బాధ్యతలను ముందుగా తీసుకెళ్ళేందుకు మీ ఆశీర్వాదం, మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాను ‘ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
హోంమంత్రి అభినందనలు…
Also Read:యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చి బాసరలో విషాదానికి గురైన విద్యార్థి
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అంటూ భగవంతుణ్ణి ప్రార్థించారు హోం మంత్రి అమిత్ షా.
ముఖ్యమంత్రి చంద్రబాబు…
Also Read:‘చంద్రబాబు అనే నేను’.. బహిరంగ సభల్లో సరికొత్త స్టైల్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.’ మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కళ్యాణ్. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ధి కార్యక్రమాలతో పెనుమార్పులు చేస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేల రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. అందుకే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
