Homeఆంధ్ర ప్రదేశ్'చంద్రబాబు అనే నేను'.. బహిరంగ సభల్లో సరికొత్త స్టైల్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం!

‘చంద్రబాబు అనే నేను’.. బహిరంగ సభల్లో సరికొత్త స్టైల్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కేవలం వ్యూహాల్లోనే కాకుండా, ప్రజల్లోకి వెళ్లే విధానంలోనూ ఆయన భారీ మార్పులు తీసుకువచ్చారు. ఇటీవల ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో సరికొత్త స్టైల్‌తో కనిపిస్తూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నారు.గతానికి పూర్తి భిన్నంగా, సభలకు వచ్చే సామాన్య ప్రజల మధ్యలోకి నేరుగా వెళ్లే విధంగా స్టేజీలను ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు. దీంతో పాటు తన మాస్ ఇమేజ్‌ను మరింతగా పెంచుకునే దిశగా ఆయన కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా సభల్లో వేదికపై నుంచి మెడలోని కండువాను ఉత్సాహంగా తిప్పుతూ కార్యకర్తలు, ప్రజల్లో కొత్త జోష్ నింపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చి బాసరలో విషాదానికి గురైన విద్యార్థి

ముఖ్యంగా తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ తమదే అధికారం అనే గట్టి ధీమాతో ఆయన ఉన్నారు. ఈ ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పరోక్షంగా ‘చంద్రబాబు అనే నేను..’ అనే డైలాగ్‌ను ఆయన తన సభల్లో వాడుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.మరోవైపు పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు సీఎం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సభల్లోనే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక అధికారుల ప్రోగ్రెస్ రిపోర్టులను ఆయన చదివి వినిపిస్తున్నారు. అభివృద్ధి పనుల వేగం ఎలా ఉందనే విషయాలను ప్రజల ముందే బహిర్గతం చేయడం వల్ల నేతలు, అధికారుల్లో అకౌంటబిలిటీ మరింత పెరుగుతుందని సీఎం గట్టిగా నమ్ముతున్నారట. మొత్తానికి, సీఎన్బీ కొత్త స్టైల్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన వ్యక్తి.. 9 చోరీలకు పాల్పడి అరెస్ట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు