-
కనిపించని వెయ్యి రోజుల పాలన సందడి
-
వేడుకలు జరుపుకోని హస్తం శ్రేణులు
-
నేతల మధ్య విభేదాలు, పడిపోతున్న గ్రాఫ్ కారణం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా వెయ్యి రోజుల పాలన అనేది ఒక పెద్ద మైలురాయి లాంటిది. ఇలాంటి సందర్భాల్లో పథకాల ప్రచారం, భారీ బహిరంగ సభలు, పత్రికల్లో ప్రకటనలు, పార్టీ శ్రేణుల సంబరాలతో వాతావరణం పండగల మారడం ఆనవాయితీ. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ప్రభుత్వపరంగా కానీ.. పార్టీ యంత్రాంగం వైపు నుంచి కానీ ఎలాంటి పెద్ద సంబరాలు అంటూ లేవు. మంత్రుల సైతం లైట్ తీసుకున్నారు.
ఉత్సాహం కరువు…
కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో ఉత్సాహం కరువైంది. ఒకవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నిజమైన పార్టీ వాదులను తీవ్ర నిరాశలో ముంచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పని చేసిన కార్యకర్తలకు కనీస గుర్తింపు లేదు. ఇన్ని రోజులు అవుతున్న కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక స్థాయి ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో భర్తీ కాకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. కష్టపడి అధికారంలోకి తెచ్చిన తమకు దక్కిన గుర్తింపు ఏమీ లేదన్న భావన కేడర్లో బలంగా ఉంది. సీనియర్ మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు, ఉమ్మడి జిల్లాల్లో వర్గ పోరు ఆ పార్టీ వాతావరణాన్ని మరింత నీరుగాచుతోంది.
పట్టు కోల్పోతున్న రేవంత్…
Also Read: వివాహేతర సంబంధం ఆరోపణలు.. వ్యక్తికి చెప్పుల దండతో ఊరేగింపు
కాంగ్రెస్ పార్టీపై పట్టు కోల్పోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఎంతవరకు పాలన పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. మూసి పునరుదజ్జీవనం, హైడ్రా, పెట్టుబడుల సేకరణ, మౌలిక వసతుల కల్పన పై పూర్తి దృష్టి పెట్టారు తప్ప పార్టీపై పట్టు వదిలేసారు. ప్రతి పథకాన్ని ఒక పొలిటికల్ ఈవెంట్ గా మార్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా ప్రజల్లోకి అనుకున్నంత బలంగా వెళ్లడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
వెంటాడుతున్న ఆర్థిక లోటు…
Also Read: డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. పెళ్లి వేడుకలో విషాదం
తెలంగాణ ప్రభుత్వం మునుపేన్నడు లేని ఆర్థిక లోటును ఎదుర్కొంటుంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. కనీసం ఎమ్మెల్యేలు అడుగుతున్నా నిధులు సమకూర్చుకోలేకపోతున్నారు. అన్నింటికీ మించి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జరగడం లేదు. వీటన్నింటికీ కారణం రేవంత్ రెడ్డిని బలహీనపరిచే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పరిణామాలే. వాటికి హై కమాండ్ ఆజ్యం పోయడం కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం అవుతోంది.
