Homeఅంతర్జాతీయంమరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. మోదీ ఉన్న ఫొటోను కట్ చేసి పోస్ట్

మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. మోదీ ఉన్న ఫొటోను కట్ చేసి పోస్ట్

క్రైమ్ మిర్రర్ : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు ఉన్న గ్రూప్ ఫొటోను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసిన తీరు వివాదానికి దారితీసింది. అసలు ఫొటోలో మోదీతో పాటు ఇతర నేతలు ఉన్నప్పటికీ.. పాకిస్థాన్ అధికారిక ఖాతాలో మాత్రం మోదీ కనిపించకుండా ఫొటోను క్రాప్ చేసి పోస్టు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సుకు భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్ సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నేతలంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో భారత ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

సదస్సుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో భాగంగా తీసిన ఈ ఫొటోలను వివిధ దేశాల ప్రభుత్వ, అధికారిక సోషల్ మీడియా ఖాతాలు పంచుకున్నాయి. అయితే పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం షేర్ చేసిన ఫొటోలో మాత్రం మోదీ కనిపించకుండా కొంత భాగాన్ని కట్ చేసినట్లు స్పష్టమవుతోంది. షెహబాజ్ షరీఫ్ మధ్యలో ఉండేలా ఫొటోను మార్చి ప్రచురించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ, దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనే దేశాధినేతలు సాధారణంగా అధికారిక ప్రోటోకాల్, దౌత్య మర్యాదలను పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని కార్యాలయం ఫొటోను ఈ విధంగా ప్రచురించడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో అసలు గ్రూప్ ఫొటోను షేర్ చేశారు. అందులో షెహబాజ్ షరీఫ్‌తో పాటు ఇతర దేశాల అధినేతలు కూడా కనిపిస్తున్నారు. దీంతో ఇరు దేశాల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచురించిన ఫొటోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాకిస్థాన్ పోస్టుపై భారతీయ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, మీమ్స్‌తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికకు సంబంధించిన అధికారిక ఫొటో విషయంలో ఇలాంటి ఎడిటింగ్ అవసరమా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
also read : కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కు బెదిరింపు లేఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు