Homeక్రైమ్ఆశ్రమం ముసుగులో మైనర్‌పై లైంగిక దాడి.. స్వామీజీ అరెస్ట్

ఆశ్రమం ముసుగులో మైనర్‌పై లైంగిక దాడి.. స్వామీజీ అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ జిల్లాలో ఆశ్రమం పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సితాయ్‌ ప్రాంతంలో ‘స్వామి వివేకానంద’ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మహారాజ్‌ జ్ఞానానంద్‌పై ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆశ్రమం పేరుతో అనుచిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహారాజ్‌ జ్ఞానానంద్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వైరల్‌ అవుతున్న వీడియో, బాధితురాలి వాంగ్మూలం, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: అల్లు అర్జున్‌కు అదే ‘ఆల్ఫా’ నిర్ణయం.. ‘పుష్ప’లో ఆ లుక్ వెనుక అసలు కథ ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు