Tuesday, March 10, 2026
Homeతెలంగాణసీఎం రేవంత్ సొంతూరు గ్రామ సర్పంచ్ ఆత్మహత్య

సీఎం రేవంత్ సొంతూరు గ్రామ సర్పంచ్ ఆత్మహత్య

సీఎం రేవంత్‌రెడ్డి సొంత కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ దుమారం రేపింది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అంటూ మాజీ మంత్రి హరీశ్‌ ట్వీట్ చేశారు. రేవంత్ .. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్యపై ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రిత్యా చర్యలకు సిద్ధమా ..? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా ..? సాయి రెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్ట రిత్యా హత్యా నేరం పెట్టాలంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

పశువుల దవాఖానా పేరుతో ఇంటికి దారిలేకుండా గోడకట్టడంతో సీఎం సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ఒక ప్రకటనలో దిగ్బాుంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

పిచ్చుకల మీద బ్రహ్మస్త్రమా  ? సీఎం రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, రేవంత్ కుటుంబం బాధ్యత వహించాలి.గోటితో పోయే సమస్యలను గొడ్డలిదాకా తెస్తున్నారు .జీవిత చరమాంకంలో ఉన్న సాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారు ?. సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీదా చర్యలు తీసుకోవాలి.కాంగ్రెస్ పాలనలో మనుషుల ప్రాణాలకు, వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయిందని నిరంజన్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments