Homeతెలంగాణఅల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ హింట్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్...!

అల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ హింట్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పుష్ప ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రాకాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్‌తో ఆయన సినిమా చేయనున్నారనే ప్రచారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మిన్నల్ మురళి సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బసిల్ జోసెఫ్, అల్లు అర్జున్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించే అవకాశాలపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రముఖ సూపర్ హీరో పాత్ర శక్తిమాన్ ఆధారంగా ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read:ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానం- వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కొడుకు

తాజాగా బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ అని ముద్రించిన టోపీ ఫోటోను షేర్ చేయడం ఆసక్తి రేపింది. ఆ పోస్టుకు బ్యాక్‌గ్రౌండ్‌లో అల్లు అర్జున్ నటించిన రింగ రింగ పాటను జోడించారు. ఫోటోలో కాస్త దూరంగా ఇద్దరు వ్యక్తులు బ్లర్‌గా కనిపించడం కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది. దీంతో బన్నీ-బసిల్ కాంబినేషన్ దాదాపు ఖాయమైందని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Also Read:కలహాల కాంగ్రెస్…! తెలంగాణ అధికార పార్టీలో శృతిమిస్తున్న విభేదాలు…

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న మరో భారీ ప్రాజెక్ట్‌లో బన్నీ నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాతే బసిల్ జోసెఫ్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే బసిల్ సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ కాంబోపై మరోసారి ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు