HomeజాతీయంEPS 2026 New Rules: ఉద్యోగులకు షాక్.. పెన్షన్ కోసం 10 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి!

EPS 2026 New Rules: ఉద్యోగులకు షాక్.. పెన్షన్ కోసం 10 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి!

పెన్షన్ ప్రయోజనాలు పొందే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. కొత్తగా అమల్లోకి వచ్చిన ‘EPS 2026’ విధానంలో సర్వీస్ కాలం, పెన్షన్ క్లెయిమ్, డబ్బుల ఉపసంహరణకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే నెలవారీ పెన్షన్

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ కాలం పనిచేసి ఉద్యోగం వదిలిన వారికి సాధారణ నెలవారీ పెన్షన్ అర్హత ఉండదు.

10 ఏళ్లలోపు ఉద్యోగం మానేస్తే రెండు అవకాశాలు

10 సంవత్సరాల సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగాన్ని వీడిన వారికి పెన్షన్ ప్రయోజనాల విషయంలో రెండు మార్గాలు ఉంటాయి.
తమ పెన్షన్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా స్కీమ్ సర్టిఫికేట్ తీసుకుని భవిష్యత్‌లో కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పెన్షన్ ప్రయోజనాలను కొనసాగించుకోవచ్చు.

ఉద్యోగం ముందే వదిలితే వెంటనే డబ్బులు రావు

రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగం మానేసిన వారు వెంటనే పెన్షన్ మొత్తాన్ని తీసుకోలేరు. చివరిసారిగా కాంట్రిబ్యూషన్ చేసిన తేదీ నుంచి నిర్దిష్ట కాలం పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం చివరి కాంట్రిబ్యూషన్ తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొంటున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో PF అడ్వాన్స్ సదుపాయం

అత్యవసర అవసరాల కోసం ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి అడ్వాన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో 75 శాతం వరకు PF మొత్తాన్ని పొందే వెసులుబాటు ఉంటుంది.

EPS పథకంలో మార్పులు ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యోగులు తమ సర్వీస్ వివరాలు, పెన్షన్ ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది.

గమనిక: పెన్షన్ నిబంధనలు, అర్హతలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున ఉద్యోగులు అధికారిక ప్రకటనలను పరిశీలించాలి.

also read: రూ.10, రూ.20 నోట్లలో కొత్త మార్పు.. త్వరలో పాలిమర్ కరెన్సీకి ఆర్బీఐ శ్రీకారం!

తాజావార్తలు