Homeతెలంగాణదేవరకొండలో అక్రమ మద్యం విక్రయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి...’

దేవరకొండలో అక్రమ మద్యం విక్రయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…’

  • వైన్స్ షాపుల పక్కనే అడ్డాలుగా మార్చుకుని సాగుతున్న అక్రమ వ్యాపారం

  • ప్రజారోగ్యం, యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకోవాలి

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): దేవరకొండ పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలపై, వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వెల్లడైన అక్రమంగా మధ్యం అమ్మకాల అంశాలు, సంబంధిత శాఖల దృష్టికి వెళ్లినా, ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైన్స్ షాపులను కేంద్రంగా చేసుకుని కూల్ డ్రింక్స్ దుకాణాలు, వాటర్ పాయింట్లు, పల్లీల స్టాళ్లు వంటి వ్యాపారాల ద్వారా మద్యం అక్రమంగా, విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాల సమయాలు ముగిసిన తర్వాత కూడా, కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Also Read:ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క ప్రకటన!

దీనివల్ల యువత సులభంగా మద్యం బారిన పడటమే కాకుండా, ప్రజాశాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ, మరింత అప్రమత్తంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న, వ్యక్తులు ఎవరైనా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల వాదన. అక్రమ విక్రయాలకు సహకరిస్తున్న వారు ఎవరైనా ఉంటే, వారిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే, ఇలాంటి కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్…

Also Read:పీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

దేవరకొండ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు చేపట్టి, అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. వైన్స్ షాపుల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల పరిశీలన, ఆకస్మిక దాడులు, అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.స్థానిక ప్రజలు అందిస్తున్న సమాచారాన్ని సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వ్యాపారాలను పూర్తిగా అరికట్టేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం వంటి, చర్యలు కూడా తీసుకోవాలని అనేకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:రాగిణి MMS 3’లో మిల్కీ బ్యూటీ తమన్నా!

ప్రజా ప్రయోజనం దృష్ట్యా దేవరకొండలో అక్రమ మద్యం విక్రయాలపై, ఎక్సైజ్ శాఖ, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలు, యువత భవిష్యత్తును కాపాడేందుకు అక్రమ మద్యం విక్రయాలకు పూర్తిగా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు