Homeతెలంగాణచిచ్చురేపిన 'హోంవర్క్' వివాదం...!

చిచ్చురేపిన ‘హోంవర్క్’ వివాదం…!

  • మతపరమైన అంశాలు బోధన…

  • కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ …!

    క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైదరాబాదులో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన హోంవర్క్ వివాదం రాజకీయరంగు కులముకుంది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన కల్మా, సురా ఫాతిహా చదివి రావాలని హోం వర్క్ ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన చిలికి చిలికి గాలి వానలా మారి రాజకీయ విమర్శలకు తావిస్తోంది. దీనిపై బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తీవ్ర విమర్శలు కూడా చేశారు.

ఫాతిహా చదవాలని…

Also Read:గోల్కొండ బోనాల జాతర షురూ.. అమ్మవారికి తొలి బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాదులోని సైదాబాద్ లో సక్సెస్ స్కూల్ ఉంది. ఆ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ డైరీలో దీనియాత్ సబ్జెక్టు కింద సుర ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇచ్చారు. అంతకుముందు కూడా కల్మా చదవాలని రాసి ఇచ్చారు. అయితే సదరు విద్యార్థి ముస్లిం కాదని.. హిందువు అని గుర్తించి ఆ హోంవర్క్ ను కొట్టేశారు. అయితే ఇదే విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో వారు యాజమాన్యాన్ని కలిసి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పిల్లలకు మతపరమైన పాఠాలను ఎందుకు బోధిస్తున్నారని ప్రశ్నించారు. అయితే స్కూల్ నిబంధనల ప్రకారమే హోంవర్క్ ఇచ్చినట్లు సదరు ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు బిజెపి నేతలను ఆశ్రయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ కూడా కొనసాగించారు. వెంటనే సదరు సక్సెస్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. అది ఆ టీచర్ చేసిన పొరపాటుగా పేర్కొంది. వెంటనే ఆ టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించారు కూడా. తమ పాఠశాలలో ముస్లిం విద్యార్థులు అధికంగా ఉన్నందున.. హోం వర్క్ లో భాగంగా అలా పొరపాటు జరిగినట్లు చెప్పుకొచ్చారు.

బండి సంజయ్ నిలదీత…

Also Read:ప్రియుడితో వివాదం… ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య – అల్లూరి జిల్లాలో విషాదం

మరోవైపు ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందూ విద్యార్థికి కల్మా, సురా ఫాతిహా హోంవర్క్ ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఇది హిందూ సంస్కృతి పై దాడిగా అభివర్ణించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై సెక్యులర్ వాదులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజం మొత్తం దీనిని ఖండించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ హోం వర్క్ వివాదం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సెగలు రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు