Homeఆంధ్ర ప్రదేశ్కడప ఎంపీగా భారతీ రెడ్డి!

కడప ఎంపీగా భారతీ రెడ్డి!

•సతీమణిని సిద్ధం చేస్తున్న జగన్
•వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం?!
•అందుకే మారిన వ్యూహం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- 

వచ్చే ఎన్నికల్లో కడప నుంచి భారతీ రెడ్డి బరిలో దిగనున్నారా? జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేసారా? వివేకానంద రెడ్డి హత్య కేసు లో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

తగ్గుతున్న వైసిపి గ్రాఫ్..
కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీన్ మారుతోంది. క్రమేపి అక్కడ వైయస్ కుటుంబ హవా తగ్గుతోంది. మొన్నటి ఎన్నికల్లోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల ఓడిపోయింది. తక్కువ మెజారిటీతో కడప ఎంపీ సీటును గెలుచుకుంది. అయితే కూటమి గెలిచిన తరువాత కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఒకవైపు రాజకీయంగాను.. మరోవైపు అభివృద్ధి పరంగాను ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ముందే మేల్కొన్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా తన భార్య భారతి రెడ్డిని బరిలోకి దించేందుకు జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారతి రెడ్డి యాక్టివ్ అయ్యారు కడపలో. తరచూ పర్యటనలు చేస్తుండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

తెరపైకి వివేకానంద రెడ్డి హత్య కేసు..
మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం ఇప్పటికీ సజీవంగా ఉంది. సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ వుచ్చు బిగుస్తోంది. ఇటువంటి తరుణంలో మరోసారి అవినాష్ రెడ్డిని బరిలో దించితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఈసారి అవినాష్ రెడ్డి ని కాకుండా భారతి రెడ్డిని బరిలో దించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు అన్న ప్రచారం కూడా ఉంది. అందుకే
వైయస్ భారతి రెడ్డిని బరిలో నిలపడం జగన్మోహన్ రెడ్డికి అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు