Homeరాజకీయంతృణముల్ ఎంపీలు సైతం!

తృణముల్ ఎంపీలు సైతం!

•రెబల్ వర్గంతో 23 మంది మంతనాలు
•ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు యత్నాలు
•ఫిరాయింపులకు దొరకకుండా..

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:- బెంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు మమతా బెనర్జీ తేరుకోనివ్వడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ నిట్ట నిలువునా చీలిపోయి.. మమతా బెనర్జీ నుంచి పార్టీ చేజారిపోయింది. అయితే ఇప్పుడు రెబల్ గ్రూప్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ విభాగం నెట్ట నిలువునా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మమతా బెనర్జీ కి కోలుకోలేని దెబ్బ ఖాయం.

శాసనసభ పక్షం కైవసం..
బెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు పట్టు సాధించారు. పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 57 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను బెంగాల్ స్పీకర్ రతీంద్ర బోస్ ధ్రువీకరించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని గౌరవిస్తున్నామని చెబుతూనే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వంతు టీఎంసీ ఎంపీలకు వచ్చింది. అభిషేక్ బెనర్జీ పట్ల పలువురు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు వీరు చర్చలు జరుపుతున్నారని.. 12 మందికి పైగా ఎంపీలు ఎందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు పార్లమెంటరీ పక్షం..
బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటు పడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు అవసరం. రాజ్యసభ పరంగా టిఎంసికి 13 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసి రావాలి. ఇప్పుడు వీరిని కూడగట్టేందుకు రెబల్ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఎలాగూ బిజెపి మద్దతు ఉండనే ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు