HomeసినిమాJanhvi Kapoor: అందులో జస్ట్ నాలుగు సీన్లే.. కానీ, ఇందులో రచ్చ రచ్చే.. జాన్వీ అలా...

Janhvi Kapoor: అందులో జస్ట్ నాలుగు సీన్లే.. కానీ, ఇందులో రచ్చ రచ్చే.. జాన్వీ అలా అనేసిందేంటి?

నటి జాన్వీ కపూర్ తాజాగా విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో  పాల్గొని అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆమె తెలుగులో మాట్లాడటం అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. జాన్వీ చెప్పిన ముద్దైన తెలుగు మాటలు అభిమానుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి.

ఆ సినిమాలో జస్ట్ నాలుగు సీన్లే, కానీ..

ఈ సందర్భంగా జాన్వీ ‘పెద్ది’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను అన్ని విధాలా అలరిస్తుందని ఆమె అన్నారు. అలాగే గత చిత్రంతో పోలిస్తే ఈసారి తాను తెరపై ఎక్కువసేపు కనిపిస్తానని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తెలుగులో జాన్వీ తొలి చిత్రం ‘దేవర’. ఆ సినిమాలో ఆమె పాత్రకు పరిమితమైన స్క్రీన్ టైమ్ మాత్రమే లభించింది. కొన్ని సన్నివేశాలు, పాటలకే ఆమె పాత్ర పరిమితమైందని అప్పట్లో సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వచ్చాయి. దీంతో ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ జాన్వీ ఈసారి ‘పెద్ది’లో ఎక్కువసేపు కనిపిస్తానని చెప్పి ఉండొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సౌత్ ఇండస్ట్రీలపై ప్రశంసలు

ఇక దక్షిణాది సినీ పరిశ్రమ గురించి కూడా జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ సినిమా నిర్మాణంలో ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. ఒక సీన్ బాగా రావాలంటే ఎంత సమయం అయినా కేటాయించేందుకు సౌత్ చిత్ర యూనిట్లు వెనుకాడవన్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో బడ్జెట్‌లు, షెడ్యూల్స్, టైమ్‌ లైన్స్‌ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఈ క్రమశిక్షణ వల్ల సృజనాత్మకతపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపారు. టాలీవుడ్‌లో మాత్రం క్రియేటివిటీతో పాటు పని గంటలను కూడా గౌరవించే సంస్కృతి తనకు బాగా నచ్చిందన్నారు.సినిమా యూనిట్లలో పనిచేసే ప్రతి ఒక్కరికీ సరైన బ్రేక్ ఇవ్వడం, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ ఉత్సాహంగా పనిలో పాల్గొనేలా వాతావరణం ఉండటం ప్రత్యేకంగా అనిపించిందని చెప్పారు.

జూన్ 4న ‘పెద్ది’ విడుదల

రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘పెద్ది’ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు