HomeUncategorizedఅల్లు అర్జున్ రాకాలో నటిస్తున్న మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ బ్యాగ్రౌండ్ తెలుసా...?

అల్లు అర్జున్ రాకాలో నటిస్తున్న మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ బ్యాగ్రౌండ్ తెలుసా…?

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ రాకా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.

ఇటీవల ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫెమినా జార్జ్.. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం అవుతానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. తన కెరీర్‌లో ఇదే అతి పెద్ద సినిమా అని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు తాను పెద్ద అభిమాని అని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డిస్కో సినిమా పూర్తయ్యాక రాకా టీం నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు.

ఫెమినా జార్జ్ అసలు కేరళలోని కొచ్చికి చెందిన మోడల్. 2021లో విడుదలైన మలయాళ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో చేసిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత తీప్పోరీ బెన్నీ, శేషం మైక్ ఇల్ ఫాతిమా, కరక్కం వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు రాకాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న విలన్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోడేలు చేయి, గుండు లుక్‌లో అల్లు అర్జున్ కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

రాకా అంటే పౌర్ణమి అనే అర్థం ఉండటంతో కథపై పలు థియరీలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు