Homeక్రైమ్బిఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్...

బిఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్…

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: బిఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.
తరువాత నాంపల్లి పీఎస్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాల్కసుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మూడు రోజుల క్రితం సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శ‌నివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని ఆయన పిలుపుని చ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధారంగానే పోలీసులు ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు.మరోవైపు తన అరెస్ట్ వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు