Homeజాతీయంరాజ‌కీయ‌వ‌ర్గాల్లో రేవంత్ హాట్ టాపిక్‌...! ఎన్డీయే స‌మావేశానికి హాజ‌రు...

రాజ‌కీయ‌వ‌ర్గాల్లో రేవంత్ హాట్ టాపిక్‌…! ఎన్డీయే స‌మావేశానికి హాజ‌రు…

  • ఢిల్లీలో ఆసక్తికర పరిణామం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కొత్త వివాదం అల్లుకుంది. ఢిల్లీలో ఎన్డీఏ బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు కావడం పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. రకరకాలుగా ప్రచారం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ విందు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీంతో ఎన్డీఏ బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి రేవంత్ ఎలా హాజరయ్యారు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు వేరు, స్నేహం వేరు అన్నట్టు రేవంత్ కొట్టి పారేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులు పార్లమెంటులో పాస్ కాలేదు. అంతటా రాజకీయం గందరగోళంగా ఉన్న తరుణంలో రేవంత్ ఇలా ఎన్డీఏ సమావేశానికి హాజరు కావడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఏపీకి చెందిన కేంద్రమంత్రి చొరవతో…

ఏపీకి చెందిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఈ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెలంగాణ బిజెపి ఎంపీ లక్ష్మణ్. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తో పాటు ఎంపీలు హాజరయ్యారు. అయితే ఇది మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంగా తెలుస్తోంది. బిజెపికి చెందిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ నేతల గౌరవార్థం ఈ విందు ఏర్పాటు చేశారు. అయితే ఎన్డీఏ పక్ష నాయకులతో సీఎం రేవంత్ సన్నిహితంగా నలగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

టిడిపి ఆహ్వానంతోనే…

తెలుగుదేశం పార్టీ నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. సాధారణంగా భిన్న రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఒకే వేదిక పైకి రావడం అరుదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి, టిడిపి నేతలతో సీఎం రేవంత్ సరదాగా ముచ్చటించడం, కలిసి గడపడం ప్రత్యేక చర్చకు దారితీసింది. నిన్ననే పార్లమెంటులో కీలకమైన 131వ సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు