Thursday, March 12, 2026
Homeతెలంగాణమోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

•ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి
•యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా,క్రైమ్ మిర్రర్ :- ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఆసుపత్రిలో వైద్యులు , సిబ్బంది రోజు వస్తున్నారా లేదా అని అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రి లో ఎంతమంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారని ఆరా తీశారు. ఇంకా ఏమైనా వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి
రోజు ఓ.పి కి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారని, వాళ్ళకి ఏమైనా టెస్టులు అవసరమైతే ఇక్కడ ల్యాబ్ లో చేస్తున్నారా, బయటకు పంపిస్తున్నారా అని తెలుసుకున్నారు. ల్యాబ్ లో రెగ్యులర్ గా ఏ ఏ టెస్టులు చేస్తున్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పేషెంట్ లకి సరిపడా మందులు
అందుబాటులో ఉన్నాయా, ఉంటే పేషెంట్లకి ఏఏ మెడిసిన్స్ ఇస్తున్నారని, మందుల స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారా లేదా అని రిజిస్టర్ ను పరిశీలించారు.ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లడుతూ.. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని పేషెంట్ ని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి కి చెకప్ కోసం వచ్చిన గర్భిణి స్త్రీ లతో కలెక్టర్ మాట్లాడారు. రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేయించుకోవాలని వారికి సూచించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఆరోగ్యము పట్ల తగు జాగ్రత్త వహిస్తే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments