Homeఅంతర్జాతీయంగద్దర్ సినిమా అవార్డులు: మెగాస్టార్ చిరంజీవి,రాజు వెడ్స్ రాంబాయి..!

గద్దర్ సినిమా అవార్డులు: మెగాస్టార్ చిరంజీవి,రాజు వెడ్స్ రాంబాయి..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్-2025’ చలన చిత్ర అవార్డులను శనివారం (మార్చి 7, 2026) ప్రకటించింది. పాత ‘నంది’ అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రవేశపెట్టిన ఈ పురస్కారాల్లో సినీ దిగ్గజాలకు మరియు చిన్న చిత్రాలకు పెద్దపీట వేశారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుంది.

లెజెండరీ గౌరవ పురస్కారాలు…

  • ఎన్టీఆర్ జాతీయ పురస్కారం: మెగాస్టార్ చిరంజీవి

  • పైడి జయరాజ్ అవార్డు: లోకనాయకుడు కమల్ హాసన్

  • ఏఎన్నార్ (ANR) అవార్డు: సహజ నటి జయసుధ

  • బి.ఎన్. రెడ్డి అవార్డు: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు

  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: నిర్మాత అశ్వినీదత్

  • కాంతారావు అవార్డు: ఆర్. నారాయణమూర్తి

  • రఘుపతి వెంకయ్య అవార్డు: రమేష్ ప్రసాద్

  • సినారె (C. నారాయణ రెడ్డి) అవార్డు: గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ

ప్రధాన విభాగాల్లో విజేతలు….

  • ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి

  • ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్ సినిమాకు)

  • ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు)

  • ఉత్తమ దర్శకుడు: సాయిలు

  • ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనిల్ రావిపూడి

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు