-
వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
-
క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ గూండాగిరీ
-
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
మంచిర్యాల క్రైమ్ మిర్రర్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆరఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. బాల్క సుమన్‌తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్క్ష్మీకాంత్ బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు.

