Tuesday, March 3, 2026
Homeతెలంగాణవింత జీవి జననం.. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో జన్మించిన మేకపిల్ల

వింత జీవి జననం.. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో జన్మించిన మేకపిల్ల

ప్రకృతి వైపరీత్యమా, జన్యుపరమైన లోపమా అన్నది స్పష్టంగా తెలియకపోయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో మేకపిల్ల జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింతను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం పరిధిలో ఉన్న కిష్టారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు కురుస సుబ్బయ్య పెంచుకుంటున్న మేక ఒక పిల్లకు జన్మనివ్వగా, ఆ మేకపిల్ల రూపం చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖంపై కళ్లు లేకపోవడం, ముక్కు లేకపోవడం స్పష్టంగా కనిపించగా, కేవలం నోరు, చెవులు మాత్రమే ఉండటం గమనార్హం.

సాధారణంగా ఇలాంటి జన్యు లోపాలతో పుట్టిన జంతువులు ఎక్కువకాలం జీవించడం కష్టమేనని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ మేకపిల్ల మాత్రం ఆశ్చర్యకరంగా చురుగ్గా కదులుతూ, తల్లి వద్ద పాలు తాగుతూ జీవిస్తోంది. ముక్కు లేకపోవడంతో నోటిద్వారానే గాలి పీల్చుకుంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వార్త గ్రామాన్ని దాటి పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో, ఆ వింత మేకపిల్లను చూడటానికి జనాలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. కొందరు ఇది ప్రకృతి వైచిత్ర్యమని భావిస్తుండగా, మరికొందరు దైవలీలగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మేకపిల్లకు సంబంధించిన చిత్రాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ALSO READ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments