Homeఅంతర్జాతీయంAyatollah Arafi: కొత్త లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ.. ప్రకటించిన ఇరాన్!

Ayatollah Arafi: కొత్త లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ.. ప్రకటించిన ఇరాన్!

  • ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ

  • అధికారికంగా ప్రకటించిన ఇరాన్ నాయకత్వం

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ నియామకమయ్యారు. ఈ మేరకు ఇరాన్ నాయకత్వం ఆయన పేరును ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించింది. ఆయన స్థానికంగా సీనియర్ మత గురువుగానే కాకుండా, గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించడంతో, ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అయతొల్లా అరాఫీని మధ్యంతర అధినేతగా నియమించింది.

ఖమేనీ వారసుడిని ఎన్నుకునేవరకు సుప్రీం లీడర్ గా అరాఫీ

ప్రస్తుతం ఇరాన్‌ను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, చీఫ్ జస్టిస్ ఘోలాంహోస్సేన్ మోసేన్ ఆధ్వర్యంలోని కౌన్సిల్ నడిపిస్తోంది. వీరే అరాఫీని సుప్రీం లీడర్‌గా నియమించారు. అరాఫీ బాధ్యతలు, విధుల్ని ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అసెంబ్లీ సమావేశమై, ఖమేనీ వారసుడిని ఎన్నుకునేవరకు అరాఫీ నియామకం చెల్లుతుంది.

ఎవరీ అలీరెజా అరాఫీ?

1959లో జన్మించిన అయతొల్లా అలీరెజా అరాఫీ ఇరాన్‌లో కీలక నేతగా ఉన్నారు. ఆయన మత గురువుగానే కాకుండా గార్డియన్ కౌన్సిల్, అసెంబ్లీ నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఇస్లామిక్ సెమినరీస్‌కు నాయకత్వం వహించారు. విద్యావంతుడు. అరబిక్, ఇంగ్లీష్‌ మాట్లాడగలడు. సాంకేతిక అంశాలపై కూడా ఆయనకు అవగాహన ఉంది. దీంతో ఆయన అయితేనే ప్రస్తుతం ఇరాన్‌ను నడిపించగలరని నాయకత్వం నమ్మింది. ఇకపై అరాఫీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడుతారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మత గురువు కూడా ఈయనే కావడం విశేషం.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు