Homeఅంతర్జాతీయంKhamenei Not Dead: ఖమేనీ బతికే ఉన్నారు.. ఇరాన్ కీలక ప్రకటన!

Khamenei Not Dead: ఖమేనీ బతికే ఉన్నారు.. ఇరాన్ కీలక ప్రకటన!

  • ట్రంప్ ప్రకటనను ఖండించిన ఇరాన్

  • ఖమేనీ సురక్షితంగా ఉన్నాడని వెల్లడి

  • గల్ఫ్ లోని 14 అమెరికా స్థావరాలపై దాడి చేశామని ప్రకటన

టెహ్రాన్‌ లోని ఖమేనీ నివాసంపై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడని అమెరికా, ఇజ్రాయెల్ దేశాధినేతలు విడివిడిగా ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలపై ఇరాన్ స్పందించింది. తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడన్న వార్తల్ని ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నాడని ప్రకటించింది.

14 అమెరికా సైనిక స్థావరాలపై దాడులు

గల్ఫ్‌ లోని 14 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేశామని తెలిపింది. వందలాది మంది అమెరికా సైనికులను హతమార్చామని వెల్లడించింది. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ఖమేనీ చనిపోయాడంటూ ఇరాన్ మీడియా వార్తలు

ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ చనిపోలేదని చెప్తున్నా, ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు మాత్రం ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు