Homeతెలంగాణనల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణం-ఎస్పీ పవార్

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణం-ఎస్పీ పవార్

క్రీడల్లో సత్తా చాటిన సిబ్బందిని అభినందించింది ఎస్పీ పవార్.

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 పోటీలు, ఫిబ్రవరి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ క్రీడా పోటీలలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన, సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో, మెడల్స్ సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో, నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందిస్తూ మెడల్స్ అందజేశారు. విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతూ, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా, మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

యాదాద్రి జోన్-5 పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, ఈ క్రీడా పోటీలలో పాల్గొని పలు మెడల్స్ సాధించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏఆర్. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాము, ఆదిరెడ్డి, నాగరాజు, ఆర్ఐలు శ్రీనివాస్, సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు