Wednesday, March 11, 2026
Homeఅంతర్జాతీయంరేపు సంపూర్ణ చంద్రగ్రహణం, దీని ప్రత్యేకత ఏంటంటే?

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం, దీని ప్రత్యేకత ఏంటంటే?

Longest Lunar Eclipse: రేపు (సెప్టెంబర్ 7న) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం అరుదైన గుర్తింపు తెచ్చుకోనుంది. 2022 తర్వాత భారత్‌ లో అత్యంత ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా గుర్తింపు పొందనుంది. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.

భారత్ లోని అన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం

ఇక 2018 జూలై 27 తర్వాత భారత్‌ లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌  సంస్థ పరిశోధకులు వెల్లడించారు. మళ్లీ ఇలాంటిది చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి చూడాలన్నారు. ఈ నెల 7,8 తేదీల (ఆది, సోమవారం) మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని వెల్లడించారు. ఆదివారం రాత్రి 8:58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 8వ తేదీ తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది. ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని అందరూ చూడవచ్చని తెలిపారు. మరోవైపు ఈ చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జోతిష్య నిపుణులు చెప్తున్నారు. చంద్రగ్రహణం సమయంలో ఏర్పడే మార్పులు, ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన మార్గాల గురించి వివరిస్తున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments