Wednesday, March 4, 2026
Homeతెలంగాణకూరగాయలు ఫ్రీ.. ఎగబడుతున్న జనాలు.. మీరు వెళ్లి తెచ్చుకోండి..

కూరగాయలు ఫ్రీ.. ఎగబడుతున్న జనాలు.. మీరు వెళ్లి తెచ్చుకోండి..

మార్కెట్ లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో పేద, మద్య తరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. అయితే అక్కడ మాత్రం కూరగాయలను ఫ్రీగా ఇస్తున్నారు రిటైల్ వ్యాపారులు. దీంతో కూరగాయలు తెచ్చుకోవడానికి జనాలు ఎగబడుతున్నారు.

పెద్దపల్లిలో కూరగాయలు ఫ్రీ ఇస్తున్నారు రిటైల్ వ్యాపారులు. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో హోల్ సేల్, రిటైల్ కూరగాయలు వ్యాపారస్తులకు వివాదం జరుగుతోంది. హోల్సేల్ వ్యాపారస్తులు రిటైల్ గా అమ్ముతున్నారని కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు రిటైల్ వ్యాపారస్తులు. హోల్సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్ గా అమ్మడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు ఫ్రీ ఇస్తుండటంతో తీసుకోవడానికి ఎగపడుతున్నారు జనాలు. మొత్తంగా హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల గొడవ ప్రజలకు ఇలా కలిసివచ్చింది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments