![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-24.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో విజయవంతంగా 8 నెలలు పూర్తిచేసుకోనుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆ పాలనను చూసి ప్రజలు చాలా భయపడిపోయారని, అందుకే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి అంగీకరించలేదని ఉన్నారు. దాని కారణంగానే కూటమి ప్రభుత్వం పై విశ్వాసం ఉంచి భారీ మద్దతుతో గెలిపించారని పొగిడారు. అంతేకాకుండా ప్రతిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారడం వల్ల ఏదో ఒక సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ ఈసారి మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
డేంజర్.. వాటర్.. మిషన్ భగీరథ నీటీలో వానపాములు…!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి బాటలో నడవబోతుందని అన్నారు. గత పాలన వల్ల రాష్ట్రం అట్టడికి పోయిందని , ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తాజాగా ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశాము. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రజలు మాకూటమి చేతికి అధికారం ఇచ్చారని, కాబట్టి ఆ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా కూడా ఆయా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులకు ముందడుగు వేస్తున్నారని అన్నారు. కాగా రేపటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కాబోతుంది.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి!.. జిల్లా వైద్యాధికారి
ఆత్మహత్య చేసుకుందామన్న వ్యక్తిని ఆరు నిమిషాలు కాపాడిన పోలీసులు?
ఆరిపోయే దీపంలా కేటీఆర్ మాటలు!.. కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే?