తెలంగాణ

8 నెలల్లో రేవంత్ రెడ్డి అవుట్.. బీజేపీ నేత సంచలనం

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పని తీరుపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారన్న సదరు నేత.. సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని చూస్తున్నారని అన్నారు. అందుకు ముహుర్తం కూడా చెప్పేశారు కమలం పార్టీ నేత.

2025 జూలై లేదా డిసెంబర్ లో ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించేయడం ఖాయమన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి. దీనిపై తనకు పక్కా సమాచారం ఉందన్నారు. రేవంత్ రెడ్డి అక్రమ దందాలపై కాంగ్రెస్ మంత్రులే హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారని ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి సోదరులు వసూల్ చేసిన వందల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలను కూడా కొందరు నేతలు ఏఐసీసీ పెద్దలకు ఇచ్చారని ఏలేటీ తెలిపారు.

ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. నామినేషన్ కార్యక్రమానికి కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ తర్వాత వయనాడ్ లో నిర్వహించిన సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యను వేదికపై రాహుల్ పక్కనే కూర్చోబెట్టారని.. రేవంత్ రెడ్డిని కనీసం వేదిక పైకి కూడా పిలవలేదన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ ఇద్దరే ముఖ్యమంత్రులు ఉన్నారని..అందులో రేవంత్ రెడ్డి ఒకరన్నారు. అయినా రేవంత్ రెడ్డిని స్టేజీ మీదకు ఎందుకు పిలవలేదే అర్ధం చేసుకోవాలన్నారు. చిన్నచిన్న లీడర్లు కూడా రాహుల్ తో పాటు వేదికపై కూర్చున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.

మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడిందన్నారు. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారని జనం అనుకుంటున్నారని ఏలేటీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు. పక్కా ఆధారాలతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button